వర్షాలు ఆలస్యమైతే ఏ పంట వేయాలి — అనంతపురం కోసం పట్టిక

అనంతపురం దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాత వ్యవసాయ జిల్లా. ఏటా 510 నుంచి 590 మి.మీ. వర్షమే, అదీ ఒక్కో సంవత్సరం ఒక్కోలా. ఇక్కడ సాధారణ ఖరీఫ్ పంట వర్షాధార వేరుశెనగ — జూన్ మధ్య నుంచి జూలై మధ్యలో విత్తుతారు.

జూలై మధ్య దాటాక విత్తితే, వేరుశెనగకు కావలసిన 105–110 రోజుల కాలం వర్షాలు ఉన్నంతలో పూర్తి కాదు. దిగుబడి పడిపోతుంది. అందుకే ICAR-CRIDA, ANGRAU కలిసి వర్షం ఆలస్యాన్ని బట్టి ఏ పంట వేయాలో పట్టిక తయారు చేశాయి.

ఏ సమయంలో ఏం వేయాలి

వర్షం మొదలైనదిఅప్పటికి పడిన వర్షంఏం వేయాలి
జూన్ 15 – జూలై 5100 mm పైగావేరుశెనగ — K-6, K-9, ధరణి, నారాయణి
జూలై 6 – జూలై 2050–100 mmతక్కువ కాలం వేరుశెనగ (K-6, K-9; 30 × 10 cm) + తేలిక నేలల్లో సజ్జ, రాగులు, కొర్రలు
జూలై 21 – ఆగస్టు 525–50 mmకొర్రలు (SiA 3085, SiA 3088), రాగులు (VR 762, GPU 28), జొన్న (PSV 56, CSV 15), కందులు (మారుతి, ICPL 87119), ఆముదం (DCH 519)
ఆగస్టు 5 తర్వాత25 mm కంటే తక్కువగోరుచిక్కుడు (RGC 936), ఉలవలు (హెబ్బాల్ హురళి 1, 2), వేరుశెనగ వద్దు

ఈ పట్టికలో ముఖ్యమైన విషయం ఒకటే — జూలై 20 దాటాక వేరుశెనగ మీద పట్టుబట్టడం లాభం కాదు. మార్కెట్ అలవాటు వల్ల చాలామంది వేరుశెనగనే వేస్తారు, కానీ ఆలస్యమైన సంవత్సరాల్లో అదే ఎక్కువ నష్టం తెస్తుంది.

మధ్యలో వర్షం ఆగిపోతే

30 నుంచి 45 రోజుల వర్షం విరామం వస్తే, పొలం చెరువులో ఉన్న నీటితో ఊడలు దిగే దశలో ఒక్క తడి ఇవ్వండి. ఆకు పచ్చగా నిలవడానికి 2% యూరియా + 1% మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేయమని CRIDA సూచిస్తుంది.

ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు

  • ప్రత్యామ్నాయ పంటల విత్తనం సకాలంలో దొరకకపోవడమే అతి పెద్ద అడ్డంకి. జిల్లా మొత్తం ఒకేసారి మారాల్సి వచ్చినప్పుడు నిల్వలు సరిపోవు — ముందుగానే RBKలో అడగండి.
  • పంట బీమా కింద మళ్లీ విత్తడానికి పరిహారం రావాలంటే, ప్రభుత్వ సూచనల ప్రకారమే పంట మార్చాలి. అందుకే RBKలో నమోదు చేయించుకోవడం ముఖ్యం.
  • మిల్లెట్లకు మార్కెట్ వేరుశెనగంత బలంగా లేదు. అమ్మే దారి ముందే చూసుకోండి.

మీ మండలం వర్ష సూచన చూడండి

ఏ వేరుశెనగ రకం వేయాలి — కాలం, దిగుబడి పోలిక

The monsoon is late — which crop should you sow? The Anantapur contingency table

Anantapur is India's second-driest agricultural district. It gets 510 to 590 mm a year, and the year-to-year variation is extreme. The standard kharif crop is rainfed groundnut, sown between mid-June and mid-July.

Sown after mid-July, groundnut cannot complete its 105-110 day cycle inside the rainfall window, and yields collapse. So ICAR-CRIDA and ANGRAU published a table of what to sow instead, keyed to how late the rain is.

What to sow, and when

Monsoon onsetCumulative rainWhat to sow
జూన్ 15 – జూలై 5100 mm పైగావేరుశెనగ — K-6, K-9, ధరణి, నారాయణి
జూలై 6 – జూలై 2050–100 mmతక్కువ కాలం వేరుశెనగ (K-6, K-9; 30 × 10 cm) + తేలిక నేలల్లో సజ్జ, రాగులు, కొర్రలు
జూలై 21 – ఆగస్టు 525–50 mmకొర్రలు (SiA 3085, SiA 3088), రాగులు (VR 762, GPU 28), జొన్న (PSV 56, CSV 15), కందులు (మారుతి, ICPL 87119), ఆముదం (DCH 519)
ఆగస్టు 5 తర్వాత25 mm కంటే తక్కువగోరుచిక్కుడు (RGC 936), ఉలవలు (హెబ్బాల్ హురళి 1, 2), వేరుశెనగ వద్దు

The one thing to take from the table: past 20 July, insisting on groundnut is not the profitable choice. Habit and the established Kadiri marketing channel pull farmers back to it, and in late years that is exactly where the loss comes from.

If the rain breaks mid-season

For a 30 to 45 day break, give one protective watering from farm-pond storage at peg initiation. To hold the canopy, CRIDA recommends a foliar spray of 2% urea + 1% MgSO4.

What gets in the way

  • Seed availability for the alternates is the real constraint — stocks run short exactly when the whole district needs to switch. Ask at your RBK early.
  • Replanting compensation under crop insurance depends on following the official advisory, which is why registering the change at the RBK matters.
  • The market for millets is not as established as for groundnut. Line up where you will sell before you sow.

Check the rain forecast for your mandal

Which groundnut variety: duration and yield compared